హీరో అల్లు అర్జున్ ఇంటి పై ఓయూ విద్యార్థులు దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ ఘటన పై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. సినీ ప్రముఖుల ఇళ్ల పై దాడి ఘటనను ఖండిస్తున్నానని ట్వీట్ చేశారు. శాంతి భద్రతల విషయంలో కఠినంగా వ్యవహరించాల్సిందిగా రాష్ట్ర డీజీపీ, నగర పోలీస్ కమిషనర్ ను ఆదేశించారు. ఈ విషయంలో ఎలాంటి అలసత్వాన్ని సహించేది లేదన్నారు. సంధ్య థియేటర్ ఘటనలో సంబంధం లేని పోలీస్ సిబ్బంది స్పందించకుండా ఉన్నతాధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి.
సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకుఅల్లు అర్జున్ ఇంటి పై దాడి చేసినటువంటి ఆరుగురికి రిమాండ్ విధించారు. దాడి చేసిన వారిని రెడ్డి శ్రీనివాస్, మోహన్, నాగరాజు, నరేష్, ప్రేమ్ కుమార్, ప్రకాష్ గా గుర్తించారు పోలీసులు. ఆరుగురుని అరెస్టు చేసి మెజిస్ట్రేట్ ముందు హాజరు పరిచారు జూబ్లీహిల్స్ పోలీసులు. ఈ నిందితుల పై BNS 331(5), 190, 191(2), 324(2), 292, 126(2), 131 సెక్షన్ ల కింద కేసు నమోదు చేశారు.