చలికాలంలో సహజంగా నొప్పులు ఎక్కువగా ఇబ్బంది పెడుతుంటాయి. ముఖ్యంగా కీళ్ల నొప్పులతో చాలామంది బాధపడతారు. చలికాలంలో ఈ ఇబ్బందిని తట్టుకోవాలంటే కొన్ని చిట్కాలు పాటించాల్సి ఉంటుంది.
శరీరాన్ని వెచ్చగా ఉంచుకోవాలి:
వాతావరణంలోని చల్లదనం వల్ల కీళ్లల్లో నొప్పులు వస్తుంటాయి కాబట్టి శరీరానికి చల్లదనం తగలకుండా వెచ్చగా ఉంచుకోవాలి. దీనికోసం స్వెటర్లు ధరించడం ఉత్తమం. చలి మరీ ఎక్కువగా ఉన్నట్లయితే చేతులకి గ్లౌజ్, కాళ్ళకి సాక్స్ వేసుకోవడం మంచిది.
శారీరకంగా శ్రమ పడకూడదు:
ఇక్కడ శ్రమ అంటే అతి శ్రమ అని అర్థం చేసుకోవాలి. కొంతమంది సాధారణంగా చేయాల్సిన పనులను కూడా.. శరీరాన్ని నొప్పించుకుని మరీ చేస్తారు. కీళ్లనొప్పులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ఉండాలంటే అతిగా శ్రమించకూడదు.
శరీర బరువును కంట్రోల్లో ఉంచుకోవాలి:
కీళ్ల నొప్పులకు ముఖ్య కారణం శరీర బరువు కూడా. శరీర బరువు ఎక్కువగా ఉన్నట్లయితే కీళ్లమీద భారం పడి నొప్పి వస్తుంది. కాబట్టి బరువును నియంత్రణలో ఉంచుకోండి.
ఎక్సర్సైజ్ చేయాలి:
అసలు ఎలాంటి వ్యాయామం చేయకుండా శరీరాన్ని ఎక్కువగా కదల్చకుండా ఉండటం వల్ల కీళ్లనొప్పులు వస్తుంటాయి. మీకు ఎక్సర్సైజ్ చేసే అలవాటు లేకపోతే ఈరోజు నుంచే ప్రారంభించండి. శరీరం ఫిట్ గా ఉంటే నొప్పులు మీ దరి చేరవు.
విటమిన్ డి ముఖ్యం:
విటమిన్ డి శరీరానికి సరిగ్గా అందకపోతే ఎముకలు వాటి దృఢత్వాన్ని కోల్పోతాయి. అలాంటి ఇబ్బంది కలగకుండా ఉండాలంటే శరీరానికి కావలసినంత విటమిన్ డి అందించాలి. దాని కోసం రోజులో కొంతసేపు ఎండలో నిలబడాలి.
డైట్ ముఖ్యం:
కూరగాయలు, పండ్లు, ఆకుకూరలు, సాల్మన్ చేపలు మొదలగు అంటే పోషకాహారాలను తీసుకోవడం వల్ల కీళ్ల నొప్పులు దూరం అవుతాయి.