కంచ గచ్చిబౌలి భూమి వివాదం.. నోటీసులపై స్మితా సబర్వాల్ రియాక్షన్ ఇదే

-

హైదరాబాద్ కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమి వివాదం రోజురోజుకు ముదురుతోంది. అయితే ఈ భూముల్లో ఉన్న చెట్లను రాష్ట్ర ప్రభుత్వం నరికివేసిందంటూ.. అందులోని వన్యప్రాణులు మరణించాయంటూ కొంతకాలం క్రితం సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అయ్యాయి. ఈ వీడియోలను రీపోస్టు చేస్తూ కొందరు అధికారులు, రాజకీయ నేతలు, సినీ ప్రముఖులు ఈ వివాదంపై తమ గళం వినిపించారు. అందులో ఐఏఎస్‌ అధికారిణి స్మితా సభర్వాల్‌ కూడా ఉన్నారు.

ఈ నేపథ్యంలో ఫేక్ వీడియోలు షేర్ చేశారంటూ స్మితా సబర్వాల్ కు గచ్చిబౌలి పోలీసులు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నోటీసులపై ఆమె తాజాగా ఎక్స్‌ వేదికగా స్పందించారు. పోలీసులకు పూర్తిగా సహకరించినట్లు చెబుతూ.. చట్టాన్ని గౌరవించే వ్యక్తిగా పోలీసులు అడిగిన ప్రశ్నలకు వివరణ ఇచ్చినట్లు వెల్లడించారు. తాను రీపోస్టు చేసినట్లే రెండు వేల మంది చేశారని.. వాళ్లందరిపైనా ఇలాంటి చర్య తీసుకుంటున్నారా..? అని ప్రశ్నించినట్లు తెలిపారు. చట్టం అందరికీ సమానమా.. ? ఎంపిక చేసిన వారినే టార్గెట్‌ చేస్తున్నారా..? అని స్మితా సభర్వాల్‌ నిలదీశారు.

Read more RELATED
Recommended to you

Latest news