ప్రయాణికులకు శుభవార్త..సికింద్రాబాద్ నుంచి ఆంధ్రాకు ప్రత్యేక రైళ్లు..

-

ప్రయాణికులకు శుభవార్త చెప్పింది దక్షిణ మధ్య రైల్వే శాఖ. వేసవి రద్దీ దృష్ట్యా సికింద్రాబాద్‌ నుంచి ఏపీలోని పలు ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లు నడుపనున్నట్లు దక్షిణ మధ్యయ రైల్వే ప్రకటించింది. సికింద్రాబాద్‌ రైల్వే జోన్‌ పరిధిలో వివిధ ప్రాంతాలకు ఏకంగా 19 వేసవి ప్రత్యేక రైళ్లు నడుపనున్నట్లు వెల్లడించింది.

హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ నుంచి ఏపీలోని విజయవాడ, తిరుపతి, కాకినాడ, నర్సాపూర్‌, లాంటి ప్రాంతాలకు రైళ్లు నడుపనున్నట్లు ప్రకటించింది. విజయవాడ- సికింద్రాబాద్‌, హైదరాబాద్‌-నర్సాపూర్‌, కాచిగూడ-తిరుపతి, సికింద్రాబాద్‌- తిరుపతి, సికింద్రాబాద్‌ -కాకినాడ టౌన్‌, సికింద్రాబాద్‌-బెర్హాపూర్‌, నర్సాపూర్‌-సికింద్రాబాద్‌, తిరుపతి-కాచిగూడ,తిరుపతి -సికింద్రాబాద్‌, కాకినాడ టౌన్‌- తిరుపతి, నాందేడ్‌- తిరుపతి, బెర్హాపూర్‌- సికింద్రాబాద్‌, తిరుపతి- కాకినాడ టౌన్‌, సికింద్రాబాద్‌-నర్సాపూర్‌, కాకినాడ టౌన్‌- వికారాబాద్‌ మధ్య ప్రత్యేక రైళ్లను నడిపించనున్నట్లు రైల్వేశాఖ పేర్కొంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version