మా మీద కోపంతో ప్రభుత్వం అలాంటి పనులు చేస్తుంది : శ్రీనివాస్ గౌడ్

-

పదినెలల తర్వాత రాష్ట్ర ప్రభుత్వం పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పై కదిలింది. దీనిని మేము స్వాగతిస్తున్నాం అని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఏదుల, నార్లాపూర్, ఏదుల కరివెన తదితర పంప్ హాజ్ లుకేసీఆర్ హయంలోనే పూర్తయ్యాయి. తొంభై శాతం ప్రాజెక్టు పనులు కేసీఆర్ హాయం లోనే జరిగాయి. కాలువల పని పెండింగ్ లో ఉంది .మేము టెండర్లు పిలిచాం.. ఈ ప్రభుత్వం వాటిని రద్దు చేసింది అన్నారు.

మేము పిలిచిన టెండర్లు కొనసాగించి ఉంటె పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు ఇప్పటికే పూర్తయ్యేది. మా మీద కోపం తో పనులను ఆలస్యం చేయొద్దు. రేపు మంత్రులు పాలమూరు ప్రాజెక్టు పనులు చూడడానికి వస్తున్నారు.. ఎపుడు ప్రాజెక్టు పూర్ర్తి చేస్తారో స్పష్టంగా చెప్పండి. ఇప్పుడు మంత్రిగా ఉన్న జూపల్లి మా పార్టీ నుండి వెళ్లిన వాడే.. కేసీఆర్ హయంలో ప్రాజెక్టుల పురోగతి ఆయనకు తెలుసు. వచ్చే పంటకు పాలమూరు ద్వారా నీళ్లిచ్చే భాద్యత ప్రభుత్వానిదే. ఇక బీసీ రిజర్వేషన్ల అధ్యయనానికి త్వరలోనే మా పార్టీ బృందం తమిళ నాడు సందర్శిస్తుంది అని శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version