మహిళల జోలికి వస్తే.. శిక్ష తప్పదు – స్పోర్ట్స్ స్కూల్‌ ఘటనపై శ్రీనివాస్‌ గౌడ్‌ సీరియస్‌

-

మహిళల జోలికి వస్తే.. శిక్ష తప్పదని స్పోర్ట్స్ స్కూల్‌ ఘటనపై తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు, యువజన సర్వీసుల శాఖల మంత్రి డాక్టర్ వి .శ్రీనివాస్ గౌడ్ సీరియస్‌ అయ్యారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న స్పోర్ట్స్ స్కూలు ఓ ఎస్ డి ని తక్షణం సస్పెండ్ చేశామని.. జరిగిన సంఘటనలపై వాస్తవ నివేదిక సమర్పించాలని 5 గురు సభ్యుల కమిటీని నియమించామని తెలిపారు. ఈ సంఘటనపై విచారణకు మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ ఆదేశాలు జారీ చేశారు.

స్పోర్ట్స్ స్కూల్లో జరిగిన ఘటనపై వచ్చిన వార్త కథన పై మంత్రి డాక్టర్ వి.శ్రీనివాస్ గౌడ్ తన అధికారిక నివాసంలో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన కించపరిచే విధంగా మాట్లాడిన ఎంతటి వారినైనా వదిలిపెట్టేది లేదని తెలిపారు. ప్రభుత్వం చిత్తశుధ్దితో ఉంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళల సంక్షేమం, ఆభివృద్ది, సాధికారత కోసం ఎన్నో కార్యక్రమాలను నిర్వహిస్తుందన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news