సీఎం కేసీఆర్ పుట్టిన రోజు వేడుకలు స్వచఛందంగా జరిపారని.. ఇది చూసి ఓర్వలేక రెండు జాతీయ పార్టీల నేతలు సభ్య సమాజం తల దించుకునేలా వ్యవహరిస్తున్నారని తెలిపారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. రాహుల్ గాందీ గురించి అస్సాం సీఎం మాట్లాడితే.. సీఎం కేసీఆర్ స్పందించే దాకా కాంగ్రెస్ నేతలు కనీసం స్పందించ లేదని.. స్పందించిన సీఎం కేసీఆర్ పై నీచంగా ప్రవర్తించడం దారుణమని ఫైర్ అయ్యారు.
రాజీవ్ గాంధీ.. ఇందిరా గాంధీ ల గురించి సీఎం కేసీఆర్ గొప్పగా చెప్పారు.. మరి అలాంటి సీఎం కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా నిరసన కార్యక్రమాలు చేపడతామని చెప్పడం.. గాడిద పై ఉరెగిస్తం అనడం దారుణమని అగ్రహించారు. మా నేత పేదలకు అండగా ఉందాం అంటారు కానీ.. ఇలా నీచంగా చేయమని చెప్పరు.. ఒక సీఎం ను పట్టుకుని ఇలా వ్యవహరిస్తారా.. ? అని నిలదీశారు. ఓ వ్యక్తిని తన తండ్రి గురించి నీచంగా మాట్లాడితే.. ఎవరూ సహించరు.. దీన్ని ఓ బీజేపీ జాతీయ నాయకురాలు కూడా సమర్టిస్తే.. మీరు ఏమీ చేయలేదని ఫైర్ అయ్యారు.
అస్సాం సీఎం వ్యాఖ్యలను సీఎం కేసీఆర్ కండిస్తే.. ఆయనను అవమాన కరంగా చేయడం ఏంటి ? అని నిలదీశారు. సీఎం కేసీఆర్ ను విమర్శించే తీరు మార్చుకోకుంటే.. ప్రజలు గుణపాఠం చెప్పటం ఖాయమని.. సీఎం కేసీఆర్ ను ముట్టుకునే స్థాయి కూడా ఎవ్వరికీ లేదని పేర్కొన్నారు. ఎవరైనా యత్నిస్తే మాడి మసి అయి పోతారని హెచ్చరించారు. మేమూ ఏనాడూ ఓ దేవాలయం కట్టి దాని పేరుతో ఓట్లు అడగలేదని.. మీ వ్యవహారం మారకపోతే ప్రజలే తగిన గుణపాఠం చెప్పటం ఖాయమన్నారు.