జూరాలలో విద్యుదుత్పత్తి ప్రారంభం అయింది. జూరాల ప్రాజెక్టుకు వరదనీరు వచ్చి చేరుతుండటంతో ఎగువ, దిగువ జల కేంద్రాల్లో అధికారులు విద్యుత్పత్తిని ప్రారంభించారు. ఎగువ విద్యుత్ ఉత్పత్తి కేంద్రానికి 13వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేయగా… మొదటి యూనిట్ తో 40 మెగావాట్ల ఉత్పత్తి జరుగుతోందని అధికారులు తెలిపారు.
ఎగువ నుంచి వచ్చిన నీటిని దిగువ విద్యుత్ కేంద్రం ద్వారా ఉత్పత్తి చేపడుతామని పేర్కొన్నారు. కాగా,తెలంగాణ ప్రజలకు అలర్ట్. బంగాళాఖాతంలో ఇప్పటికే అల్పపీడనం ఏర్పడింది. ఈ నెల 24న దక్షిణ ఒడిశా ఉత్తర ఆంధ్ర సమీపంలోని వాయువ్య బంగాళాఖాతం, పరిసరాల్లోని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇవాల్టి నుంచి నాలుగు రోజులపాటు తెలంగాణలో కుండపోత వర్షాలు కురుస్తాయని చెప్పారు.