ఆలయం పక్కన ఇల్లు కట్టుకోకూడదా..?

-

ఆలయాల పక్కన ఇల్లుని కట్టుకోకూడదని.. ఆలయం నీడ కానీ ఆలయ ధ్వజ స్తంభం నీడ కానీ ఇంటి మీద పడకూడదని అంటుంటారు. అయితే ఇది నిజమా కాదా అనే విషయానికి వస్తే.. ఆలయం పక్కన ఇల్లు ఉండడం మంచిది కాదు. ఆలయం నీడ పడేలా కానీ ఆలయం ధ్వజస్తంభం యొక్క నీడ పడేలా కానీ ఇల్లును కట్టుకోవడం మంచిది కాదు. ఆలయానికి ఇంటికి మధ్య కచ్చితంగా కొంచెం గ్యాప్ అనేది ఉండాలి. కొన్ని అడుగుల దూరాన్ని పాటించి ఆ తర్వాత మాత్రమే ఇల్లు కట్టుకోవాలని వాస్తు పండితులు అంటున్నారు. కాబట్టి కచ్చితంగా వీటిని పాటించండి. లేదంటే నెగటివ్ ఎనర్జీ కలగడం అనవసరమైన ఇబ్బందులు ఎదుర్కోవడం వంటివి జరుగుతాయి.

 

ఇంటిని దేవాలయం తో పోలుస్తారు మన పెద్దలు కాబట్టి ఇంటిని కట్టేటప్పుడు కచ్చితంగా కొన్ని నియమాలు అని పాటించాలి. శివాలయానికి వంద బారల లోపు ఇల్లు ఉండకుండా చూసుకోవాలి. వంద బారల దూరం వైష్ణవాలయానికి, 50 బారల దూరం వైష్ణవాలయనకి ముందు వదిలేసి ఇల్లు కట్టుకోవచ్చు. కనీసం ఆలయానికి 50 బార్లు వదిలేసి కట్టుకుంటే మంచిది.

శక్తి ఆలయానికి 120 బారలు దాకా మీరు స్థలం వదిలేసి అప్పుడు ఇల్లు కట్టుకోవచ్చు ఎనిమిది బారల వరకు వదిలేసి ఆంజనేయస్వామి ఆలయం నుండి ఇల్లును కట్టుకోవచ్చు. ఇలాంటి పొరపాట్లు చేయకుండా పండితులు చెప్పినట్లు మీరు పాటిస్తే ఖచ్చితంగా మంచి జరుగుతుంది పాజిటివ్ ఎనర్జీ కలుగుతుంది ఎలాంటి చిక్కులు కూడా ఉండవు.

Read more RELATED
Recommended to you

Latest news