దీపావళి పండుగ రోజు రాత్రికి ఎన్ని క్రాకర్స్ పేలుతాయో.. ఎంత కాలుష్యం కమ్ముకుంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే.. మనం ప్రతీ సంవత్సరం చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా హైదరాబాద్ లో నివసించే యువత రోడ్లపై బాంబులు పేల్చుతూ బైకులపై తిరుగుతుంటారు. ఈ నేపథ్యంలో సైబరాబాద్ సీపీ అవినాష్ మోహంతి తాజాగా ఓ కీలక ప్రకటన చేశారు.
సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో రాత్రి 8 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకే క్రాకర్స్ కాల్చుకోవాలని సూచించారు. ఈ మేరకు పొల్యుషన్ కంట్రోల్ బోర్డు నుంచి ఆర్డర్స్ వచ్చాయని ప్రకటనలో తెలిపారు. అక్టోబర్ 31 నుంచి నవంబర్ 02 వరకు దీపావళి సందర్భంగా ఈ నిబంధనలు ఉంటాయని ప్రజలు గ్రహించి తమకు సహకరించాలని కోరారు. రాత్రి 8 గంటలకు ముందు కానీ.. 10 గంటల తరువాత కానీ పబ్లిక్ ప్లేసుల్లో, పోలీస్ స్టేషన్ల పరిదిలో క్రాకర్స్ పేల్చితే వారిపై చట్టపరమ్ైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ విషయాన్ని గమనంలో పెట్టుకొని దీపావళి పండుగను ప్రశాంతంగా జరుపుకోవాలని సూచించారు సీపీ అవినాష్ మోహంతి.