మాట తప్పిన వారికి ప్రశ్నించే నైతిక హక్కు లేదు : ఎమ్మెల్యే మెఘా రెడ్డి

-

మాట తప్పినవారికి ప్రశ్నించే నైతిక హక్కు లేదని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు. గురువారం ఎమ్మెల్యే వనపర్తి జిల్లా కేంద్రంలో మాజీ భారత ప్రధాని ఇందిరా గాంధీ వర్ధంతి పురస్కరించుకొని విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వనపర్తి నియోజకవర్గ పరిధిలోని 592 మంది లబ్దిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ.. రైతులకు రుణమాఫీ
చేస్తామని పదేళ్లపాటు కాలయాపన చేసి, అన్నదాతలను మోసం చేసిన బీఅర్ఎస్ పార్టీ నాయకులకు
రుణమాఫీ పై మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు.

ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను రూ. 7 లక్షల 12 వేల కోట్ల అప్పు చేసి అప్పుల రాష్ట్రంగా మార్చారని ఆరోపించారు. రైతుల చేత చేతులెత్తించడం కాదని రుణమాఫీ అంశంలో బహిర్గతంగా చర్చకు రావాలని ఎమ్మెల్యే సవాల్ విసిరారు. గ్రామాలలో ప్రజలకు అన్ని రకాల మౌలిక వసతులు కల్పించినప్పుడే సర్వతోముఖాభివృద్ధి సాధించిన వారమవుతామన్నారు. పదవులు పోయి పది నెలలు కాకముందే కారు కూతలు కుస్తున్నారని విమర్శించారు. ప్రజలందరికీ ఇందిరమ్మ రాజ్యంలో సొంత ఇండ్లు, పింఛన్లు, రుణమాఫీ, విద్యుత్ రాయితీ, సిలిండర్లు, ఉచిత బస్సు ప్రయాణం రేషన్ కార్డులతో సహా అన్ని రకాల ప్రభుత్వ పథకాలను అందజేస్తామని భరోసా కల్పించారు.

Read more RELATED
Recommended to you

Latest news