BRS పార్టీ ఫిరాయింపుల కేసు.. స్పీకర్ పై సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు

-

బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అనర్హత కేసుపై తాజాగా సుప్రీంకోర్టులో మరోసారి విచారణ జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ స్పీకర్ తరఫున సీనియర్ లాయర్ ముకుల్ రోహత్గీ వాదనలు వినిపిస్తూ.. స్పీకర్ కు రాజ్యాంగం కల్పించిన విశేషాధికారాలను కోర్టులు హరించలేవని అన్నారు. ఆయన నిర్ణయం తీసుకున్న తర్వాతే న్యాయ సమీక్షకు అవకాశం ఉంటుందని తెలిపారు. స్పీకర్ కాలపరిమితితో నిర్ణయం తీసుకోవాలని న్యాయస్థానాలు చెప్పడం భావ్యం కాదని.. ఒక రాజ్యాంగ వ్యవస్థపై మరో రాజ్యాంగ వ్యవస్థ పెత్తనం చేయలేదని వ్యాఖ్యానించారు.

పిటిషనర్ల తరఫున జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌ స్పందిస్తూ సరైన సమయంలో నిర్ణయం తీసుకోవాలని స్పీకర్‌కు చెప్పలేమా? ఆదేశించడమో చేయలేమా? అని ప్రశ్నించగా.. ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని స్పీకర్‌కు ఫిర్యాదు చేసిన వారంలోనే కోర్టులో ఒకదాని తర్వాత మరొక పిటిషన్లు దాఖలు చేస్తూ వచ్చారని రోహత్గీ అన్నారు. కనీసం పరిశీలించే అవకాశం కూడా లేకుండా పిటిషన్లు వేశారని కోర్టుకు తెలిపారు. అయితే రోహత్గీ వాదనలపై జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌ స్పందిస్తూ.. కోర్టులు రాజ్యాంగ పరిరక్షకులుగా వ్యవహరిస్తాయని .. నాలుగేళ్ల పాటు స్పీకర్‌ పార్టీ మారిన ఎమ్మెల్యేలపై ఎలాంటి చర్యలు తీసుకోకపోతే కోర్టులు చూస్తూ ఉండాల్సిందేనా? అని ప్రశ్నించారు. అయితే ఫిరాయింపుపై పిటిషనర్ల ఇష్టానుసారం స్పీకర్‌ వ్యవహరించలేరని రోహత్గీ పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news