కల్వకుంట్ల కవితకు సుప్రీం కోర్టు బెయిల్ ఇచ్చింది. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సీబీఐ, ఈడీ నమోదు చేసిన కేసుల్లో కల్వకుంట్ల కవితకు ధర్మాసనం బెయిల్ మంజూరు చేయడం జరిగింది. మార్చి 15న ఆమెను కల్వకుంట్ల కవితను అదుపులోకి తీసుకున్నారు. అప్పటి నుంచి 153 రోజులుగా ఆమె తీహార్ జైలులో ఉన్నారు. అయితే… తాజాగా ఢిల్లీ లిక్కర్ కేసులో ఈడీ, సీబీఐ రెండు కేసుల్లోనూ ఎమ్మెల్సీ కవితకు బెయిల్ మంజూరు చేసింది సుప్రీంకోర్టు.
ప్రెస్ మీట్, బహిరంగ సభలు బయటకు వెళ్లిన తర్వాత పెట్టకూడదని సుప్రీం కోర్టు కండీషన్లు పెట్టిందట. కాగా… మార్చి 15 న ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. అంతకు ముందు పది రోజుల ముందు ఈడి నోటీసులు ఇచ్చింది. 2022 జులై లో లిక్కర్ స్కామ్ వెలుగు లోకి వచ్చింది. దాదాపు 5 నెలల తర్వాత మొదటిసారిగా కవితను విచారించింది సిబిఐ.
2022 డిసెంబర్ 11న కవిత ఇంట్లోనే విచారించిన సిబిఐ…. లిక్కర్ స్కామ్ లో సి ఆర్ పి సి 160 కింద 7 గంటల పాటు వాంగ్మూలం నమోదు చేసి చేసింది. 2023 మార్చ్ 11న మొట్టమొదటిసారిగా ఈ డి విచారణకు హాజరైన కవిత…. ఆ తర్వాత 16, 20, 21 న ఢిల్లీలో కవితను విచారించింది ఈడి. అనంతరం అరెస్ట్ అయిన కవిత 153 రోజుల తర్వాత రిలీజ్ అవుతున్నారు.