ఒవైసీ కాలేజే కాదు.. ఇల్లు కూడా కూల్చాల్సిందేనని సంచలన వ్యాఖ్యలు చేశారు బీజేపీ ఎమ్మెల్యే రాజసింగ్. హైడ్రా పై బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ స్పందించారు. ఒవైసీ ఇల్లు కూడా గవర్నమెంట్ ల్యాండ్లనే ఉండొచ్చు దాని పైన కూడా ఎంక్వయిరీ చేయండి ముఖ్యమంత్రి గారంటూ పేర్కొన్నారు. దానిపైన కూడా బుల్డోజర్ నడపాలని నేను కోరుతున్నానని చెప్పారు. ఓవైసీ ఫాతిమా కాలేజ్ చెరువు పైన కట్టారు.
ఎట్టి పరిస్థితిలో మీరు ఆ కాలేజ్ ని డిమాలిష్ చేయాలని మేము కోరుతున్నామని చెప్పారు రాజాసింగ్. అయ్యా జాగీరు లాగా కాలేజ్ కట్టుకున్నారని… అప్పుడు వాళ్ల గులాం పార్టీ BRS అధికారంలో ఉందన్నారు. దాని జోలికి వస్తె 40 వేల యువకులు చూసుకుంటారని అక్బరుద్దీన్ ఒవైసీ బెదిరిస్తున్నారని.. రేవంత్ రెడ్డి వాళ్ళకి భయపడొద్దని కోరారు. మీరు తీసుకున్న సంకల్పం తో ముందుకు వెళ్ళాలి… చెరువులో కబ్జాల ను తొలగించండని కోరారు. నా నియోజక వర్గం లో కూడా ప్రభుత్వ స్థలాలు కబ్జాకు గురయ్యాయని… హైదారాబాద్ కలెక్టర్ పట్టించుకోవడం లేదని ఆగ్రహించారు.