తెలంగాణ పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కు బిగ్ షాక్ తగిలింది. తాజాగా తెలంగాణ పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కు సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. గత ఎన్నికల్లో శ్రీనివాస్ గౌడ్ ఎన్నిక వివాదంపై సుప్రీంకోర్టులో నిన్న రాత్రి విచారణ జరిగింది. 2018 ఎన్నికల్లో తప్పుడు అఫిడవిట్ సమర్పించారని తెలంగాణ పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పై పిటిషన్ దాఖలు చేశారు.
![](https://cdn.manalokam.com/wp-content/uploads/2023/11/Supreme-Court-notices-to-Minister-Srinivas-Goud.jpg)
మహబూబ్ నగర్ వాసి రాఘవేందర్ రాజు పిటిషన్ ను ఇటీవల కొట్టివేసింది హై కోర్టు. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు రాఘవేందర్ రాజు. రాఘ వేందర్ రాజు పిటిషన్ పై విచారణ జరిపింది జస్టిస్ అనిరుద్ద బోస్, జస్టిస్ బేలా త్రివేది ధర్మాసనం. రాఘవేందర్ రాజు పిటిషన్ కు సమాధానం చెప్పాలని నోటీసులు జారీ చేసింది సుప్రీ కోర్టు ధర్మాసనం. ఈ తరుణంలోనే..తెలంగాణ పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కు సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది.