జగదీశ్ రెడ్డిని గెలిపించేందుకే నాకు టికెట్‌ ఇవ్వలేదు..పటేల్ రమేష్ కన్నీటి పర్యంతం

-

జగదీశ్ రెడ్డిని గెలిపించేందుకే నాకు టికెట్‌ ఇవ్వలేదని సూర్యాపేట కాంగ్రెస్ పార్టీ నాయకులు పటేల్ రమేష్ కన్నీటి పర్యంతం అయ్యారు. సూర్యాపేట కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రాంరెడ్డి దామోదర్ రెడ్డిని ఖరారు చేస్తూ పార్టీ నిర్ణయం తీసుకుంది. దీంతో టికెట్ ఆశించి బంగపడిన పటేల్ రమేష్ రెడ్డి పార్టీ అధిష్టానం తీసుకున్న నిర్ణయంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న ఆయన అనుచరులు జనగాం క్రాస్ రోడ్ పై రాస్తారోకో చేయడంతో.. భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.

Suryapet Congress party leaders Patel Ramesh was in tears

అధిష్టానం పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు కార్యకర్తలు. వరుసగా రెండవసారి టికెట్ ఆశించి భంగపడిన పటేల్ రమేష్ ఆయన సతీమణి లావణ్య రెడ్డి బో రున విలపించింది.. పార్టీ కోసం రాత్రి పగలు కష్టపడితే పార్టీ ఇచ్చే ప్రతిఫలం ఇదేనా అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. అటు విషయం తెలుసుకున్న కార్యకర్తలు, ఆయన అభిమానులు, కుటుంబ సభ్యులు రమేష్ రెడ్డి ఇంటికి చేరుకోవడంతో ఇంటివద్ద పరిస్థితి ఉద్విగ్నంగా మారింది. కార్యకర్తలు, ఆలోచనలతో మాట్లాడి తదుపరి కార్యాచరణ ప్రకటిస్తారని పటేల్ రమేష్ రెడ్డి స్పష్టం చేశారు. తనకు టికెట్ రాకుండా కుట్ర జరిగిందని.. ఇదంతా మంత్రి జగదీష్ రెడ్డి గెలిపించేందుకే చేశారని ఆయన తీవ్ర ఆరోపణ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news