తిరుమల భక్తులకు అలర్ట్‌…దీపావళి రోజున బ్రేక్‌ దర్శనాలు రద్దు

-

తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్‌…దీపావళి రోజున బ్రేక్‌ దర్శనాలు రద్దు కానున్నాయి. తిరుమల శ్రీవారి ఆలయంలో ఈనెల 12న దీపావళి ఆస్థానాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా విఐపి బ్రేక్ దర్శనాలను రద్దు చేసినట్లు టీటీడీ తెలిపింది. ప్రోటోకాల్ దర్శనం మినహా మిగిలిన బ్రేక్ దర్శనాలు రద్దు చేశామని వివరించింది.

Break darshans are canceled on Diwali

11న బ్రేక్ దర్శనానికి సిఫార్సు లేఖలు కూడా స్వీకరించబోమని వెల్లడించింది. ఇక, దీపావళి పండగ రోజున ఉదయం 7 నుంచి 9 గంటల వరకు బంగారు వాకిలి ముందున్న గంటా మండపంలో ఆస్థానం జరగనుంది. ఇది ఇలా ఉండగా..  ఇవాళ 10 గంటలకు తిరుమల శ్రీవారి టికెట్లు విడుదల కానున్నాయి. డిసెంబర్ 23 నుంచి జనవరి 1వ తేది వరకు తిరుమల వైకుంఠ ద్వార దర్శనం జరుగనుంది. ఈ తరుణంలోనే.. ఇవాళ ఆన్ లైన్ లో వైకుంఠ ద్వార దర్శన టికెట్లను విడుదల చేయనుంది టీటీడీ పాలక మండలి.

Read more RELATED
Recommended to you

Latest news