BREAKING : రాజా సింగ్ సస్పెన్షన్ ఎత్తివేసిన బిజెపి

-

రాజా సింగ్ కు బీజేపీ అధిష్టానం గుడ్‌ న్యూస్‌ చెప్పింది. రాజా సింగ్ సస్పెన్షన్ ఎత్తివేసింది బిజెపి పార్టీ. ఈ మేరకు శాసనసభ్యులు రాజాసింగ్ పై కేంద్ర పార్టీ సస్పెన్షన్ ఎత్తివేసిందని బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు జి కిషన్ రెడ్డి ప్రకటించారు. అంతేకాదు.. మొదటి లిస్ట్ లో రాజాసింగ్ ఉన్నట్లు ప్రకటించారు బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు జి కిషన్ రెడ్డి.

ఇది ఇలా ఉండగా… తెలంగాణలో బిజెపితో జనసేన పొత్తు కుదిరింది. ఈ తరుణంలోనే.. జనసేన కు కొన్ని సీట్లు కేటాయించనుంది బిజెపి పార్టీ. ఈ మేరకు ఇవాళ బిజెపి తొలి జాబితా విడుదల చేయనుంది. 55 మందితో బిజెపి లిస్ట్ రిలీజ్‌ చేయనున్నారు. తొలి జాబితాలో ముగ్గురు ఎంపిలు ఉంటారట. పెండింగ్ లో అంబర్ పేట, ముషీరా బాద్ నియోజక వర్గాలు ఉండనున్నాయి. తెలంగాణలో జనసేనకు బీజేపీ 12 సీ ట్లు కేటాయించింది. వైరా, మధిర, ఖమ్మం, కొత్తగూడెం, అశ్వారావుపేట, పాలేరు, సత్తుపల్లి, యెల్లందు, కూకట్‌పల్లి, నక్రేకల్‌, కోదాడ, పాలకుర్తిలను జనసేనకు కేటాయించారు.

Read more RELATED
Recommended to you

Latest news