జై బీజేపీ, విజయ్ బీజేపీ – రాజాసింగ్‌

-

జై బీజేపీ, విజయ్ బీజేపీ అంటూ బీజేపీ నేత రాజాసింగ్‌ పోస్ట్‌ పెట్టారు. బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్‌పై సస్పెన్షన్ ఎత్తివేసింది బీజేపీ అధిష్టానం. సస్పెన్షన్ ఎత్తివేసిన బీజేపీ సెంట్రల్ డిసిప్లెలినరీ కమిటీ.. ఈ మేరకు అధికారిక ప్రకటన చేసింది. సస్పెన్షన్ ఎత్తివేయడంపై రాజాసింగ్‌ స్పందించారు. సంస్థే ప్రధానం!! నా సస్పెన్షన్‌ను రద్దు చేసినందుకు ముందుగా, గౌరవనీయులైన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా జీ, హోంమంత్రి అమిత్ షా జీ కృతజ్ఞతలు చెప్పారు రాజాసింగ్.

అలాగే.. ఆర్గనైజేషన్ సెక్రటరీ బీఎల్ సంతోష్ జీ, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి జీ, ఓబీసీ మోర్చా సభ్యులు జాతీయ అధ్యక్షుడు డా. లక్ష్మణ్ జీ, తెలంగాణ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ జీ మరియు మురళీధర్ రావు గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు అంటూ పోస్ట్‌ పెట్టారు రాజాసింగ్‌. అలాగే… జై బీజేపీ, విజయ్ బీజేపీ అని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news