ఇంటర్‌ విద్యాశాఖ ఏడీ ప్రసన్నలతపై సస్పెన్షన్‌ వేటు

-

ఇంటర్‌ విద్యాశాఖ కార్యాలయంలో అసిస్టెంట్‌ డైరెక్టర్‌(ఏడీ)గా పనిచేస్తున్న కేఎం ప్రసన్నలతను సస్పెండ్‌ చేశారు. ఈ మేరకు ఇంటర్‌ విద్యాశాఖ కమిషనర్‌ జలీల్‌ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. తండ్రి పీటర్‌ సూపరింటెండెంట్‌గా పనిచేస్తూ చనిపోవడంతో కారుణ్య నియామకం కింద ఆమె 1993లో జూనియర్‌ అసిస్టెంట్‌గా చేరారు. ఆ తర్వాత పదోన్నతులు పొంది ప్రస్తుతం ఏడీగా కొనసాగుతున్నారు.


కారుణ్య నియామకం కింద ఉద్యోగంలో చేరాలంటే ఆ కుటుంబంలోని వారు ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగులై ఉండరాదు. అయితే తల్లి సౌభాగ్యమ్మ అప్పటికే ప్రభుత్వ ఎయిడెడ్‌ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు. ఆమె 2010లో పదవీ విరమణ పొందారు. ప్రస్తుతం పింఛను పొందుతున్నారు. ఆ విషయాన్ని వెల్లడించకుండా అక్రమంగా ఉద్యోగం పొందినందుకు ప్రసన్నలతను సస్పెండ్‌ చేశారు.

ఈ విషయాన్ని స్వయంగా ఇంటర్ విద్యాశాఖ కమిషనర్ జలీల్ వెల్లడించారు. ఇలాంటి చర్యలు పునరావృతమైతే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. ఇంకెవరూ ఇలా అక్రమంగా ఉద్యోగం పొందరాదని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news