పదవులు తీసుకోవడం తప్పా.. ప్రజలకు సేవ చేయడం తప్పా.. అని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ కుటుంబాన్ని ప్రశ్నించారు. మీలాగా కుటుంబ సభ్యులందరికీ పదవులు తీసుకోలేదు.. తాను అందుబాటులో లేనప్పుడు తన సోదరుడు ప్రజలకు సేవ చేస్తున్నాడు. మీ కుటుంబంలా అందరికీ పదవులు మేము కట్టబెట్టలేదు. కొడంగల్ నియోజకవర్గానికి ఏ సమస్య వచ్చినా నా సోదరుడు అందుబాటులో ఉంటాడని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు.
పోయిన ఐదేండ్లు ఒకాయన ఈడ ఉండే.. ఆయన లా మనం వ్యవహరించడం లేదు. కేసీఆర్ లా కుటుంబ సభ్యులకు పదవులు ఇవ్వలేదన్నారు. ఎలాగైనా కోడంగల్ ను ముంచాలని కేసీఆర్ చూస్తున్నారు. 13నెలలు అయినా ప్రతిపక్ష నేత అసెంబ్లీకి ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు. ఊర్లలో సర్పంచ్ లేకపోతే పదవీ వదిలిపెట్టమని మనం అడుగుతాం.. అలాగే ప్రతిపక్షనేత అసెంబ్లీకి రానప్పుడు ఆ పదవీ ఎందుకు అన్నారు. పరిశ్రమల కోసం భూసేకరణ చేస్తుంటే.. కొందరూ రాళ్లపై దాడులు చేయిస్తున్నారు.