పైలట్ గ్రామానికే పథకాల పై కేటీఆర్ ఫైర్..!

-

రిపబ్లిక్ డే సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించిన నాలుగు సంక్షేమ పథకాలు ముందుగా మండలానికి ఒక పైలట్ గ్రామంలోనే వంద శాతం అమలు చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క  చేసిన ప్రకటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా మండిపడ్డారు. మండలానికి ఒక గ్రామంలోనే అమలు చేస్తామని మీ కాంగ్రెస్ మ్యానిఫెస్టో పంచారా? అని, మండలానికి ఒక గ్రామంలోనే అని మీ గ్యారెంటీ కార్డులు ఇచ్చారా? అని, మండలానికి ఒక గ్రామంలోనే అని మీ ఎన్నికల ప్రచారం చేశారా? అని భట్టిని కేటీఆర్ ప్రశ్నించారు.

మండలానికి ఒక గ్రామంలోనే ప్రజలను ఓటేయమని అడిగారా? అని, మండలానికి ఒక గ్రామంలోనే ఓట్లు వేస్తే అధికారంలోకి వచ్చారా? అని నిలదీశారు. ఎన్నికల్లో నాడు “అందరికీ అన్నీ” అని.. నేడు
“కొందరికే కొన్ని” పేరిట మభ్యపెడితే నాలుగు కోట్ల తెలంగాణ మీ నయవంచనను క్షమించదని కేటీఆర్ హెచ్చరించారు. ఎన్నికలప్పుడు రాష్ట్రంలోని ప్రతి మండలం..ప్రతి గ్రామంలోని..ప్రతి ఇంటా.. అబద్ధపు హామీలను ఊదరగొట్టి..”వన్ ఇయర్” తరువాత “వన్ విలేజ్”అనడం ప్రజలకు వెన్నుపోటు పొడవడమేనని కేటీఆర్ విమర్శించారు.

Read more RELATED
Recommended to you

Latest news