తెలంగాణ సాంస్కృతి సంప్రదాయాలను చాటి చెప్పే విధంగా బోనాల ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు తలసాని శ్రీనివాస్ యాదవ్. లాల్ దర్వాజ ఆలయానికి చేరుకున్న మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్…ఈ సందర్భంగా మాట్లాడారు. గోల్కొండ లో ప్రారంభమైన బోనాలు యావత్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరుతున్నాయి…బోనాలకు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు బోనాల పండుగ అన్నారు.
చాలా అద్భుతంగా జరుగుతున్నాయన్నారు తలసాని. రాజకీయాలకు అతీతంగా బోనాల జాతర జరుగుతుందని.. ఏ ప్రభుత్వాలు దేవాలయాలకు నిధులు ఇవ్వడం లేదన్నారు. తెలంగాణ ప్రభుత్వం బోనాలకు ప్రత్యేక నిధులు కేటాయించిందని.. అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరికి ఉండాలని అమ్మవారి ని కోరుకున్నానని చెప్పారు తలసాని. ఢిల్లీలో కూడా బోనాలు చేసి మన సంప్రదాయం ను చాటి చెప్పారని..కుల మతాలకు అతీతంగా ఐక్యత తో బోనాల ఉత్సవాలు చేసుకోవాలని వివరించారు. ప్రశాంతంగా బోనాలు ఉత్సవాలు జరుపుకోవాలని కోరుకుంటున్నామని పేర్కొన్నారు తలసాని.