నష్టాల్లో ట్విటర్.. కారణమేంటో చెప్పిన ఎలాన్ మస్క్

-

ప్రముఖ మైక్రో బ్లాగింగ్ సంస్థ ట్విటర్ గత కొంత కాలంగా వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే. గత కొన్నేళ్లుగా ఈ సంస్థ ఒడిదొడుకులు ఎదుర్కొంటోంది. అయితే ట్విటర్ సంస్థ నష్టాల్లో ఉన్నట్లు ఆ సంస్థ యజమాని ఎలాన్ మస్క్ తెలిపారు. అడ్వర్టైజ్‌మెంట్ల ఆదాయం సగానికి తగ్గటం వల్ల ట్విటర్‌ నష్టాల్లో ఉన్నట్లు.. ఆ సంస్థ యాజమాని ఎలాన్‌ మస్క్‌ తెలిపారు. వ్యాపార సలహా అందించే ట్వీట్‌కు ఈ మేరకు స్పందించారు.

ప్రకటనల ఆదాయం 50 శాతం వరకు తగ్గటంతో పాటు భారీ రుణభారం వల్ల.. ట్విటర్‌ నష్టాల్లో సాగుతున్నట్లు పేర్కొన్నారు. మరేదైనా లగ్జరీని పొందే ముందు.. లాభాల  పట్టాల్సి ఉంటుందని మస్క్‌ ట్వీట్‌ చేశారు. ట్విట్టర్‌ నుంచి వైదొలిగిన ప్రకటనకర్తలు తిరిగి వచ్చారని, రెండో త్రైమాసికంలో ట్విట్టర్‌ లాభాలబాట పడుతుందని ఏప్రిల్‌లో పేర్కొన్నారు.  ప్రకటనలరంగంతో బలమైన సంబంధాలు కలిగిన లిండా యక్కరినోను ట్విట్టర్‌ సీఈవోగా నియమించారు. అయినా.. ట్విటర్‌ లాభాలదశకు చేరుకోకపోవటానికి మస్క్‌ నిర్ణయాలు,  కారణమనే వాదన వినిపిస్తోంది. ట్విట్టర్‌ను 44 బిలియన్‌ డాలర్లకు కొనుగోలు చేసిన నాటి నుంచి.. లాభాల బాట పట్టించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news