హైదరాబాద్ లో పుట్టిన పండగనే.. బోనాలు అని తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలు బోనాలు జరుపుకుంటున్నాయి.. అది గర్వకారణమని కొనియాడారు. ప్రపంచంలో జరిగే భారీ ఊరేగింపు ఏదంటే.. ఉమ్మడి దేవాలయాల ఆధ్వర్యంలో జరిగే బోనాలేనని.. గత యాభై ఏళ్ళ నుంచి బోనాలని అధికార పండగగా నిర్వచాలని డిమాండ్ చేసాం.. కానీ రాష్ట్రము వచ్చాకే అది సాధ్యమయిందని పేర్కొన్నారు.
హైదరాబాద్ లోని దేవాలయాల్లో బోనాల నిర్వహణ కోసం 15కోట్లు కేటాయించామని.. రేపు రంగం.. ఆ తరువాత ఊరేగింపు కార్యక్రమం ఉంటుందని స్పష్టం చేశారు తలసాని. అమ్మవారి గుడి ప్రాంగణంలో రోడ్స్.. లైట్స్ ఏర్పాటు చేసాం.. ప్రపంచంలో ఎక్కడ లేని పండగలు మనం ఘనంగా జరుపుకుంటున్నామని వెల్లడించారు. ప్రభుత్వం అన్ని పండగలను ఘనంగా నిర్వహిస్తుంది.. పండగలను డబ్బులు కేటాయించి.. నిర్వహిస్తున్న ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేదని చెప్పారు. అన్ని విధాలుగా అందరికి ప్రభుత్వం తోడుంటుంది.. అందరం అన్నదమ్ములాగా కలిసి ఉందాం.. ఎవరికీ ఇబ్బంది కలిగించకుండా జరుపుకుందామన్నారు.