BREAKING : గవర్నర్ లేకుండానే.. సచివాలయం ప్రారంభం !

-

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ నూతన సచివాలయం ఆదివారం ప్రారంభం కానుంది. ముందుగా తెల్లవారుజామున 5:30 గంటలకు పూజ కార్యక్రమాలు ప్రారంభం అయ్యాయి. సచివాలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రేకుల షెడ్డులో సుదర్శన యాగం నిర్వహించనున్నారు.

ఈ యాగం మధ్యాహ్నం ఒంటిగంటకు మొదలై 1:20 గంటలకు పూర్తవుతుంది. ఆ తర్వాత అర్చకులు నిర్ణయించిన పుష్కర అంశలో సీఎం కేసీఆర్ నూతన సచివాలయాన్ని ప్రారంభిస్తారు. అనంతరం ఆయన నేరుగా ఆరో అంతస్తులోని తన కార్యాలయానికి చేరుకుంటారు. ఆ తర్వాత మంత్రులు, అధికారులు కూడా వారి చాంబర్లకు వెళతారు.

మధ్యాహ్నం 1:58 నుంచి 2:04 గంటల మధ్య ఆరు నిమిషాల వ్యవధిలో సీఎం సహా మంత్రులు, అధికారులు అందరూ ఏదో ఒక ఫైల్ పై సంతకం చేసేస్తారు. దీని తర్వాత మధ్యాహ్నం 2:15 గంటలకు సచివాలయ ఉద్యోగులతో ముఖ్యమంత్రి అక్కడే సమావేశమై… మంత్రులు, అధికారులతో మాట్లాడతారు. అయితే.. ఈ కొత్త సచివాలయం ప్రారంభానికి తెలంగాణ గవర్నర్‌ తమిళి సై ఉండటం లేదు. అయితే.. ఆమెకు ఆహ్వానం పంపినా.. రావడంలేదని సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news