టికెట్ ఇవ్వకుంటే కారు దిగతా : తీగల కృష్ణారెడ్డి

-

బీఆర్ఎస్​ పార్టీలో మరో అసంతృప్తి గళం వినిపించింది. ఇప్పటికే మాజీ ఎంపీ పొంగులేటి, మాజీ మంత్రి జూపల్లి కాంగ్రెస్​లో చేరడం ఖాయమైపోయింది. ఇక తాజాగా బీఆర్ఎస్ నేత, రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి అధిష్ఠానంపై తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. అంతటితో ఆగకుండా.. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తనకు టికెట్ ఇవ్వకపోతే కారు దిగడం ఖాయమని తేల్చి చెప్పారు.

‘‘కాంగ్రెస్‌ నుంచి గెలిచిన సబితా రెడ్డిని పార్టీలోకి తీసుకొని సీఎం కేసీఆర్‌ తప్పుచేశారు. మా కోడలు డా.అనితారెడ్డి రంగారెడ్డి జడ్పీ ఛైర్‌పర్సన్‌గా ఉండడంతో ఒకే ఇంట్లో రెండు పదవులు కావాలా అని అంటున్నారు. మేం కూడా విమర్శిస్తే బాగుండదు. నేను కేసీఆర్‌తో సమానంగా రాజకీయాల్లో ఉన్నా. ఉద్యమంలో పని చేసిన సీనియర్‌ నాయకులు చాలా మంది పార్టీని వీడుతున్నారు. వారందర్నీ పిలిపించి మాట్లాడాలి. లేకుంటే మా దారి మేం చూసుకుంటాం. కాంగ్రెస్‌ నుంచి నన్ను ఇప్పటివరకు ఎవరూ సంప్రదించలేదు’’ అని తీగల కృష్ణారెడ్డి పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version