ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ రాష్ట్రాలు అప్పుల్లో పోటీ పడుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు మారిన తర్వాత…. అప్పులు భారీగా చేస్తున్నాయని విమర్శలు కూడా వస్తున్నాయి. అయితే ఇలాంటి నేపథ్యంలో… కేంద్ర ప్రభుత్వం కూడా… రెండు తెలుగు రాష్ట్రాలకు అప్పులు వచ్చేలా… సానుకూలంగా వ్యవహరిస్తోంది.

ఇక లేటెస్ట్ గా మరో ఐదు వేల కోట్లు అప్పు చేసేందుకు ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధమవుతున్నాయట. ఆగస్టు 5వ తేదీన తెలంగాణ అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలు కూడా అప్పులు చేసేందుకు సంసిద్ధమవుతున్నట్లు వార్త బయటకు వచ్చింది. ఈ మేరకు ఓ ప్రకటన కూడా వెలువడింది. దీనికి సంబంధించిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.