ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చేనేత కార్మికులకు అదిరిపోయే శుభవార్త అందింది. మరమగ్గాలు ఉన్న చేనేత కార్మికులకు ఈనెల 7వ తేదీ నుంచి ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేయబోతున్నట్లు రాజాగా సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటన చేశారు. పవర్ లూమ్స్ కు 500 అలాగే హ్యాండ్లూమ్స్ కు 200 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ అందిస్తామని కూడా ఈ సందర్భంగా వెల్లడించారు.

వైయస్సార్ కడప జిల్లా జమ్మలమడుగు మండలం గూడెం చెరువులో శుక్రవారం ప్రజా వేదికలో ఆయన మాట్లాడుతూ ఈ ప్రకటన చేశారు. అటు ఆటో ఎక్కిన సీఎం చంద్రబాబు.. అందరినీ ఆశ్చర్యపరిచారు. కడప జిల్లా జమ్మలమడుగులో పర్యటించిన CM చంద్రబాబు.. పింఛన్ల పంపిణీ చేశారు. తరువాత స్థానిక ఆటో డ్రైవర్లతో కాసేపు ముచ్చటించారు. ఆటోలో ప్రయాణిస్తూ వారికి ఎదురయ్యే ఇబ్బందులు, డీజిల్ ధరలు, ఆదాయం వంటి అంశాల గురించి తెలుసుకున్నారు.