రెండు తెలుగు రాష్ట్రాలలో మోస్తారు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. రాబోయే ఐదు రోజులలో ఏపీలోని పలు ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. ఈనెల రెండో వారంలో వర్షాలు అధికంగా కురిసే అవకాశాలు ఉన్నాయని స్పష్టం చేసింది.

ఉత్తర కోస్తా, రాయలసీమలో ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా ఎక్కువగా ఉంటాయని IMD స్పష్టం చేసింది. తెలంగాణలో ఈనెల ఏడు వరకు మోస్తారు వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. హైదరాబాద్, మెదక్, కరీంనగర్, వరంగల్, మహబూబాబాద్ లాంటి ప్రాంతాలలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని స్పష్టం చేశారు. 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని పేర్కొన్నారు. వర్షాలు కురిసే సమయంలో ప్రజలు చెట్ల కింద బయట ఉండకూడదని స్పష్టం చేశారు అధికారులు.