పంజాబ్ లో తెలంగాణ ఆర్మీ జ‌వాన్ మిస్సింగ్

తెలంగాణ రాష్ట్రం లోని సిద్దిపేట్ జిల్లా కు చెందిన ఆర్మీ జవాన్ మిస్సింగ్ ఆందోళ‌న క‌లిగిస్తుంది. సిద్దిపేట్ జిల్లా లోని చేర్యాల మండ‌లం పోతిరెడ్డి ప‌ల్లి కి చెందిన సాయి కిర‌ణ్ రెడ్డి అనే జ‌వాన్ పంజాబ్ లో విధులు నిర్వ‌హిస్తున్నాడు. అయితే జ‌వాన్ కిర‌ణ్ రెడ్డి సెల్ ఫోన్ గ‌త వారం రోజుల నుంచి స్విచ్ ఆఫ్ లో ఉండ‌టం తో త‌న కుటుంబం స‌భ్యులు ఆందోళ‌న చెందుతున్నారు. సాయి కిర‌ణ్ రెడ్డి 20 రోజుల సెల‌వుల‌లో భాగం గా న‌వంబ‌ర్ 16 న సొంత గ్రామానికి వ‌చ్చాడు.
సెల‌వులు ముగిసిన వెంట‌నే డిసెంబ‌ర్ 5న మ‌ధ్యాహ్నం త‌న గ్రామం నుంచి బ‌య‌లు దేరాడు. ఆ రాజు రాత్రి 8 గంట‌ల‌కు తాను హైద‌రాబాద్ లోని ఆర్జీఐ ఎయిర్ పోర్ట్ లో  ఉన్నా అని తండ్రి కి ఫోన్ చేసి చెప్పాడు. అదే చివ‌రి ఫోన్ కాల్.. అప్ప‌టి నుంచి సాయి కిర‌ణ్ రెడ్డి స్వీచ్ ఆఫ్ లో వ‌స్తుంద‌ని తండ్రి పోలీసుల‌కు ఫీర్యాదు చేశాడు. అయితే సాయి కిర‌ణ్ రెడ్డి పంజాబ్ లోని భటిండా స‌మీపం లో గ‌ల ఫ‌రీద్ కోట్ లో విధులు నిర్వ‌హిస్తాడు. అయితే సాయి కిర‌ణ్ రెడ్డి మిస్సింగ్ లో పంజాబ్ పోలీసులు అప్ర‌మ‌త్తం అయ్యారు. కిర‌ణ్ రెడ్డి కోసం గాలిస్తున్నారు.