తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సర్వం సిద్దం ఐంది. ఇవాళ ఉదయం 7 గంటల నుంచే అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగనుంది. సాయంత్రం 5 గంటల వరకు ఈ పోలింగ్ నిర్వహిస్తారు అధికారులు. తెలంగాణలో మొత్తం 119 నియోజక వర్గాలకు పోలింగ్ జరుగనుంది. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు.
ఎన్నికల వేళ పోలీసులకు అధికారులు దశదిశా చేశారు. సెంట్రల్ జోన్ డీసీపీ నేతృత్వంలో రవీంద్ర భారతిలో లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్ & మహిళ పోలీసు సిబ్బందికి డ్యూటీ అలార్ట్ సూచనలు సలహాలు చేశారు. నిర్భయంగా ఓటు హక్కు వినియోగం, పోలింగ్ కేంద్రాల వద్ద భద్రత, 144 సెక్షన్ అమలు, మాక్ పోలింగ్, అంశాలపై పోలీసులకు సూచనలు చేశారు ఎన్నికల అధికారులు. అటు ఓటేయడానికి హైద్రాబాద్ నుంచి సొంత ఊర్లకు జనాలు వెళుతున్నారు. ఈ నేపథ్యంలోనే జూబ్లీ, mgbs బస్టాండ్ లు కిక్కిరిశాయి. ఇసుకేస్తే రాలనంత జనంతో నిండిపోతున్నాయి బస్సులు.