తెలంగాణలో అసెంబ్లీ ఎన్నిక షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయిన నల్లగొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ఇవాళ ఆయన పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో పాల్గొన్న అనంతరం ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు ఒకేసారి జరగవని.. షెడ్యూల్ ప్రకారమే అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని తెలిపారు. ముఖ్యంగా ఈ ఏడాది చివరలో తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి.
తెలంగాణ ఎన్నికలకు సంబంధించి అభ్యర్ధుల ఎంపిక ప్రక్రియను వేగవంతం చేస్తామని ఆయన వెల్లడించారు. రేపటి నుంచే ప్రచారాన్ని మరింత ఉధృతం చేస్తామని ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. మహిళా రిజర్వేషన్ బిల్లు వచ్చే అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలకు వర్తించదన్నారు. జనగణన, నియోజకవర్గాల పునర్విభజన జరగాలన్నారు. ఆ తర్వాతే చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమలవుతాయని ఉత్తమ్ తెలిపారు. ఇవాళ లోక్ సభలో మహిళా బిల్లును కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘాల్ పార్లమెంట్ లో మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టారు.