తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రేపటికి వాయిదా పడిపోయాయి. ఇక అటు కాసేపట్లో కేబినెట్ సమావేశం కూడా ప్రారంభం కానుంది. గవర్నర్ ప్రసంగం, శాఖల వారీగా ఆర్థిక పరిస్థితి గురించి శ్వేతపత్రంపై చర్చించనుంది తెలంగాణ కేబినెట్. ఇది ఇలా ఉండగా,పాడి కౌశిక్ రెడ్డి ప్రమాణ స్వీకార సమయంలో ఆయన కూతురు అత్యుత్సాహం చూపింది.
గ్యాలరీ నుంచి గట్టిగా కేకలు వేసిన కౌశిక్ రెడ్డి కూతురు శ్రీనిక… ఐ లవ్ యు డాడీ అంటూ గట్టిగా నినాదాలు చేసింది. ఈ తరుణంలోనే నిర్ఘాంత పోయి చూసారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఇతర శాసన సభ్యులు. అటు ఒక్కసారిగా అలెర్ట్ అయిన సెక్యురిటి సిబ్బంది… కౌశిక్ రెడ్డి కూతురు శ్రీనికను బయటకు పంపించారు. ఇప్పుడు ఈ సంఘటన హాట్ టాపిక్ అయింది.