వారం రోజుల పాటే.. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

-

వారం రోజుల పాటే.. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరుగనున్నాయి. కాసేపటి క్రితమే బీఏసీ సమావేశం ముగిసింది. ఇక ఈ సందర్భంగా వారం రోజుల పాటే.. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించేలా నిర్ణయం తీసుకున్నారు. 25 న బడ్జెట్ ప్రవేశ పెట్టనున్నారు. జులై 31 వరకు అసెంబ్లీ సమావేశాలు జరుగనున్నాయి. ఆదివారం సెలవు ఉంటుంది.

మరో వారం తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు పొడిగించాలని ప్రతిపక్షం డిమాండ్ చేస్తోంది. జూలై 31 వరకు బడ్జెట్ ఆమోదం తెలపల్సి ఉందని ప్రభుత్వం ప్రకటించింది. ఆ తర్వాత సభ పొడిగింపుపై స్పీకర్ నిర్ణయం తీసుకుంటారని సర్కార్ వెల్లడించింది.

అటు ఇవాళ ఉదయం సభ ప్రారంభం కాగానే.. కంటోన్మెంట్‌ దివంగత ఎమ్మెల్యే లాస్య నందిత మృతికి సంతాపంగా తీర్మానం ప్రవేశపెట్టిన సీఎం రేవంత్‌రెడ్డి.. ఇలాంటి బాధాకరమైన తీర్మానం ప్రవేశపెట్టాల్సి వచ్చినందుకు చింతిస్తున్నట్లు చెప్పారు. లాస్య నందిత తండ్రి సాయన్న తనకు అత్యంత సన్నిహితులు, ఆప్తులు అని తెలిపారు. చాలా సంవత్సరాలు ఆయనతో కలిసి పనిచేసినట్లు గుర్తు చేసుకున్నారు. ఎమ్మెల్యేలుగా ప్రజాక్షేత్రంలో పనిచేశామని వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version