ఎంపీ అభ్యర్థుల రెండో జాబితాపై బీజేపీ కసరత్తు.. ఆ రోజే విడుదల

-

తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల జోరు కొనసాగుతోంది. ప్రధాన పార్టీలన్నీ ఓవైపు ప్రచారం నిర్వహిస్తూ మరోవైపు అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తున్నాయి. ఇప్పటికే ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్లు కొన్ని స్థానాలకు ఎంపీ అభ్యర్థులను ప్రకటించారు. ఇందులో భాగంగా కమలం పార్టీ మొదటి జాబితాలో 9 మంది పేర్లను ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు రెండో జాబితాపై దృష్టి సారించింది.

ఈ నేపథ్యంలోనే బీజేపీ లోక్‌సభ అభ్యర్థుల రెండో జాబితా మార్చి 11న విడుదల కానుంది. ఈనెల 10న దిల్లీలో పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశమై చర్చించనుంది. రెండో జాబితాలో ఆరు స్థానాలకు నేతల పేర్లను ప్రకటించే అవకాశముందని పార్టీ వర్గాల సమాచారం. మార్చి 13న ఎన్నికల షెడ్యూల్‌ వచ్చే అవకాశముందని, ఆ తర్వాత పెండింగ్‌ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేస్తారని పార్టీ నేతలు చెబుతున్నారు.

ఇక మొదటి జాబితాలో సికింద్రాబాద్‌ – కిషన్‌రెడ్డి (కేంద్రమంత్రి), కరీంనగర్‌ – బండి సంజయ్‌, నిజామాబాద్‌ : డి.అర్వింద్‌, చేవెళ్ల – కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, మల్కాజిగిరి – ఈటల రాజేందర్‌, జహీరాబాద్‌ – బీబీ పాటిల్‌, హైదరాబాద్‌ – మాధవీలత, నాగర్‌ కర్నూల్‌ – భరత్‌ ప్రసాద్‌, భువనగిరి – బూర నర్సయ్యగౌడ్‌లను అభ్యర్థులుగా ప్రకటించింది.

Read more RELATED
Recommended to you

Latest news