ఇవాళే తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో నిన్న జరిగిన తెలంగాణ రాష్ట్ర కేబినేట్ సమావేశంలో… రాష్ట్ర బడ్జెట్ కు ఆమోద ముద్ర పడింది. ఉద్యోగుల వేతనాలు, ఇతర నిర్వహణ వ్యయానికి సంబంధించిన పొద్దు, ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలు ఇతర సంబంధించిన ప్రగతి ఇలా ఎన్నో అంశాలతో ఈ సారి బడ్జెట్ ను రూపొందించారు మంత్రి హరీష్ రావు.
ఉద్యోగుల వేతన సవరణ అలాగే కొత్త ఉద్యోగాల నియామకానికి అవసరమైన మొత్తాన్ని నిర్వహణ పద్దు లో సర్దుబాటు చేసినట్లు సమాచారం. 2022-23 లో రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్యాలకు అనుగుణంగా… ఆయా శాఖలు, సంక్షేమ పథకాలు ఇతర కార్యక్రమాలకు కేటాయింపులు చేసినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా కొత్త పింఛన్లు దారులను చేర్చుకుంటున్న నేపథ్యంలో… వారి కోసం ప్రత్యేక నిధిని ఆర్థిక శాఖ ఏర్పాటు చేసినట్లు సమాచారం అందుతోంది. వచ్చే నెల నుంచి కొత్త పింఛన్లు పెరిగే ఛాన్స్ ఉన్న నేపథ్యంలో వారి కోసం బడ్జెట్ ను పెంచనుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం.