Telangana budget : తెలంగాణ బడ్జెట్ 2 లక్షల 75 వేల కోట్లుగా ఉన్నట్లు సమాచారం అందుతోంది. మరి కాసేపట్లో తెలంగాణ ప్రభుత్వం శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. ఈ నేపథ్యంలో బడ్జెట్‌కు ఆమోద ముద్ర వేసేందుకు తెలంగాణ రాష్ట్ర కేబినెట్ భేటీ అయింది. ఈ సందర్భంగా ‘ఓటాన్ అకౌంట్’ బడ్జెట్ కు ఆమోద ముద్ర కూడా వేసింది తెలంగాణ కేబినేట్.
అసెంబ్లీలో ‘ఓటాన్ అకౌంట్’ బడ్జెట్ ప్రవేశ పెట్టనున్న విషయం తెలిసిందే. శాసనసభలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మండలిలో మంత్రి శ్రీధర్ బాబు బడ్జెట్‌ను పెట్టనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు కాంగ్రెస్ ప్రభుత్వం తొలి బడ్జెట్ ను ప్రవేశపెడుతుంది.
అటు మాజీ సీఎం కేసీఆర్ నేడు అసెంబ్లీ సమావేశాలకు హాజరుకానున్నారు. రెండు రోజుల కిందట సమావేశాలు ప్రారంభం అవ్వగా ఆయన శాసనసభకు హాజరుకాలేదు. కాగా, ఇవాళ 2024-25 సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. ఈ నేపథ్యంలో ఆయన సభకు రానున్నారు. ప్రతిపక్ష నేత హోదాలో కేసీఆర్ తొలిసారిగా సమావేశాలకు హాజరవుతుండటంపై ఆసక్తి నెలకొంది.