Telangana Budget 2024: తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశ పెట్టారు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. 2024-25 ఓటాన్ అకౌంట్ బడ్జెట్ 2,75,891 కోట్ల రూపాయాలు..ఉన్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ఆరు గ్యారెంటీల కోసం రూ.53,196 కోట్లు అంచనా వేస్తున్నట్లు ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వివరించారు.విద్యుత్ – గృహ జ్యోతికి 2418కోట్లు, విద్యుత్ సంస్థలకు 16825 కోట్లు, గృహ నిర్మాణానికి 7740 కోట్లు, నీటి పారుదల శాఖ కు 28024 కోట్లు పెడుతున్నట్లు ఆయన చెప్పుకొచ్చారు. మాది ప్రజల ప్రభుత్వమని ఈ సందర్భంగా వివరించారు.
తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం తెస్తామని మాట ఇచ్చామని ప్రకటించారు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క. తెలంగాణ రైతులకు ఆర్థిక శాఖ మంత్రి భట్టి శుభవార్త చెప్పారు. త్వరలోనే రూ.2 లక్షల రైతు రుణమాఫీ చేస్తామని ప్రకటన చేశారు. రూ.2 లక్షల రుణమాఫీపై త్వరలోనే కార్యాచరణ రూపొందించినట్లు ప్రకటించారు. ఈ మేరకు రూ.2 లక్షల రైతు రుణమాఫీపై విధివిధానాలు ఖరారు చేయబోతున్నామని వెల్లడించారు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క.
ఏ శాఖకు ఎన్ని కోట్లంటే
- ఆరు గ్యారంటీలకు వచ్చిన దరఖాస్తులు 1.29 కోట్లు
- ఆరు గ్యారెంటీ పథకాల అమలు కోసం 53,196 కోట్లు
- పరిశ్రమల శాఖకు 2,543 కోట్లు
- ఐటీ శాఖకు 774 కోట్లు
- పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ
40,080 కోట్లు - పురపాలక శాఖ 11,692 కోట్లు
- వ్యవసాయ శాఖ 19, 746 కోట్లు
- బీసీ సంక్షేమం 8 వేల కోట్లు
- బీసీ సంక్షేమం, బీసీ గురుకుల భవనాల నిర్మాణం కోసం 1546 కోట్లు.
- విద్యా రంగానికి 21389కోట్లు.
- తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటుకు 500 కోట్లు.
- యూనివర్సిటీల్లో సదుపాయాలకు 500 కోట్లు
- వైద్య రంగానికి 11500 కోట్లు
- విద్యుత్ – గృహ జ్యోతికి 2418కోట్లు.
- విద్యుత్ సంస్థలకు 16825 కోట్లు.
- నీటి పారుదల శాఖ కు 28024 కోట్లు
- గృహ నిర్మాణానికి 7740 కోట్లు.
- విద్యుత్ సంస్థలకు 16825 కోట్లు.
- నీటి పారుదల శాఖ కు 28024 కోట్లు
- గృహ నిర్మాణానికి 7740 కోట్లు.
- మూసీ సుందరీకరణ, అభివృద్ధికి 1000 కోట్ల బడ్జెట్
- ఎస్సీ సంక్షేమానికి 21,874 కోట్లు
- ఎస్టీ సంక్షేమానికి 13,313 కోట్లు
- మైనారిటీ సంక్షేమానికి 2262 కోట్లు
- బీసీ సంక్షేమానికి 8,000 కోట్లు