టీఎస్‌పీఎస్సీపై సీఎం రేవంత్‌ రెడ్డి సమీక్ష

-

తెలంగాణ రాష్ట్రంలో కొలువుదీరిన ప్రభుత్వం ఆరు గ్యారెంటీలపై ప్రస్తుతం ప్రధానంగా దృష్టి సారిస్తోంది. అయితే గత సర్కార్ ప్రధాన వైఫల్యమైన ఉద్యోగ నోటిఫికేషన్లపై ఈ కొత్త ప్రభుత్వం నిర్ణయాలు ఎలా ఉంటాయని ఇప్పుడు ఆసక్తిగా మారింది. ఈ క్రమంలోనే తాజాగా సీఎం రేవంత్ రెడ్డి ఉద్యోగ నోటిఫికేషన్లు, టీఎస్పీఎస్సీ, పదో తరగతి, ఇంటర్ పరీక్షలపై సమీక్ష నిర్వహిస్తున్నారు.

టీఎస్‌పీఎస్‌సీ కార్యకలాపాలు, పరీక్షల నిర్వహణపై ఈ సమీక్షలో అధికారులతో చర్చిస్తున్నారు. గతంలో జరిగిన విషయాలను అధికారులను అడిగి తెలుసుకుంటున్నారు. టీఎస్‌పీఎస్‌సీ ద్వారా నియామకాలు, ఇతర అంశాలపై సమీక్షిస్తున్నారు. కమిషన్ ఛైర్మన్ జనార్దన్‌ రెడ్డి అంశం గురించి కూడా సమీక్ష జరుపుతున్నట్లు సమాచారం. మరోవైపు మరో మూణ్నెళ్లలో జరగబోయే పదో తరగతి, ఇంటర్ పరీక్షల నిర్వహణపైనా సీఎం రేవంత్ రెడ్డి అధికారులతో చర్చిస్తున్నారు.

టీఎస్పీఎస్సీ ఛైర్మన్ రాజీనామా, కమిషన్ ప్రక్షాళన అనేవి ఇప్పుడు విపక్షాలతో పాటు నిరుద్యోగులు, ఉద్యోగ సంఘాలు చేస్తున్న ప్రధాన డిమాండ్లు. అయితే ఈ కొత్త ప్రభుత్వం వీటిపై ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news