రాష్ట్రంలో పలువురు ఐపీఎస్‌ అధికారులు బదిలీ

-

తెలంగాణలో కొలువుదీరిన కాంగ్రెస్ సర్కార్ తన చర్యలతో దూసుకెళ్తోంది. కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతోంది. ఓవైపు ఎన్నికల్లో తాము ఇచ్చిన గ్యారెంటీల అమలుపై ఫోకస్ చేస్తూనే మరోవైపు అధికార యంత్రాంగ ప్రక్షాళనపై దృష్టి సారించింది. ఈ క్రమంలోనే తాజాగా పలువురు ఐపీఎస్‌ అధికారులను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. ఇందులో హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లకు కొత్త పోలీస్ కమిషనర్లను నియమించింది. ఈ సందర్భంగా రాష్ట్ర సర్కార్ ఉత్తర్వులు కూడా జారీ చేసింది.

ఈ ఉత్తర్వుల్లో హైదరాబాద్‌ సీపీగా కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డిని నియమించినట్లు ప్రభుత్వం పేర్కొంది. సైబరాబాద్‌ పోలీస్ కమిషనర్​గా అవినాష్‌ మహంతి, రాచకొండ సీపీగా సుధీర్‌ బాబును నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం హైదరాబాద్ సీపీగా బాధ్యతలు నిర్వహిస్తున్న సందీప్ శాండిల్యను నార్కోటిక్‌ బ్యూరో డైరెక్టర్‌గా నియమించింది. ఇప్పటి వరకు సైబరాబాద్‌, రాచకొండ సీపీలుగా వ్యవహరించిన స్టీఫెన్‌ రవీంద్ర, దేవేంద్ర సింగ్‌ చౌహాన్‌లను డీజీపీకి రిపోర్టు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.

Read more RELATED
Recommended to you

Latest news