సాగర్‌ టెయిల్‌పాండ్‌ నుంచి నీటి తరలింపుపై తెలంగాణ అభ్యంతరం

-

కృష్ణా బోర్డుకు సమాచారం ఇవ్వకుండా నాగార్జునసాగర్‌ టెయిల్‌పాండ్‌ నుంచి నాలుగు టీఎంసీల నీటిని ఆంధ్రప్రదేశ్‌ తరలించుకుపోయిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై తెలంగాణ అభ్యంతరం తెలిపింది. ఈ విషయంపై బోర్డు ఛైర్మన్‌ శివ్‌నందన్‌ కుమార్‌కు తెలంగాణ నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్‌ బొజ్జా.. ఫోన్‌లో ఫిర్యాదు చేశారు.

టెయిల్‌పాండ్‌ గేట్లు ఎత్తి దిగువన ఉన్న పులిచింతలకు ఏపీ నీటిని విడుదల చేసుకుంది. సాగర్‌ నుంచి ఆ రాష్ట్ర కోటా కింద విడుదల చేస్తున్న నీటి వాటా 5.5 టీఎంసీలలో ఈ 4 టీఎంసీలను మినహాయించాలి. దీనిపై మేం లిఖితపూర్వకంగానూ ఫిర్యాదు చేశాం. ఆంధ్రప్రదేశ్‌ తాగునీటి అవసరాల కోసం బోర్డు చేసిన కేటాయింపులను మించి ఆ రాష్ట్రం తరలిస్తోంది. కృష్ణా బేసిన్‌ ఆవలి అవసరాలకూ నీటిని మళ్లిస్తుంది. ఈ  అంశాన్ని పరిగణనలోనికి తీసుకోవాలి. అని రాహుల్ బొజ్జా కోరారు.

దీనిపై బోర్డు ఛైర్మన్‌ స్పందిస్తూ..తెలంగాణ కూడా కేటాయింపుల కన్నా అధికంగానే వినియోగించిందని పేర్కొంటూనే.. తెలంగాణ ఫిర్యాదుపై సోమవారం సాయంత్రం ఏపీకి లేఖ కృష్ణా బోర్డు రాసింది. టెయిల్‌పాండ్‌లో నిల్వ ఉంచిన నీటిని ఏపీ తరలించుకోవడం సరైన చర్య కాదని ఆ లేఖలో పేర్కొన్నట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Exit mobile version