నేడు దిల్లీలో కాంగ్రెస్‌ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం

-

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు ఎన్నికల బరిలో దిగే అభ్యర్ధుల ఎంపిక ప్రక్రియను వేగవంతం చేసింది. అందులో భాగంగా ఇవాళ దిల్లీలో కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం కానుంది. రాష్ట్రంలోని 17 నియోజక వర్గాలకు అభ్యర్ధుల ఎంపిక కోసం స్క్రీనింగ్‌ కమిటీ ఇచ్చే నివేదికపై సీఈసీ చర్చించి తుదినిర్ణయం తీసుకోనుంది. ఇప్పటికే స్క్రీనింగ్‌ కమిటీ కసరత్తు పూర్తి చేసిన జాబితా దిల్లీ చేరింది.

ఇవాళ సాయంత్రం దిల్లీలో జరగనున్న సీఈసీ సమావేశానికి రాష్ట్రం నుంచి పీసీసీ అధ్యక్షుడి హోదాలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి దీపాదాస్‌ మున్షీలు, సీఈసీ సభ్యుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి హాజరు కానున్నట్లు సమాచారం. స్క్రీనింగ్‌ కమిటీ ఎంపిక చేసిన నియోజక వర్గానికి ఒకరు ఇద్దరు అభ్యర్ధులపై సర్వేలు నిర్వహించినట్లు సమాచారం. ఇటీవల బయట నుంచి కాంగ్రెస్‌ పార్టీలోకి చేరిన నాయకులపై కూడా సర్వే చేసినట్లు తెలుస్తోంది. కొందరు ఆశావహుల పట్ల స్థానికంగా వ్యతిరేకత వ్యక్తం అవుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news