తెలంగాణలో ఎలాగైనా పూర్వ వైభవం సాధించాలని కాంగ్రెస్ తహతహలాడుతోంది. ఈ క్రమంలోనే వచ్చే అసెంబ్లీ ఎన్నికల కోసం సమాయత్తమవుతోంది. ఇందులో భాగంగానే తన కేడర్‌ను బలపర్చుకుంటోంది. జాతీయ నేతలను రంగంలోకి దించుతోంది. రాష్ట్ర ప్రజల్లోకి క్షేత్రస్థాయిలో వెళ్లేందుకు కృషి చేస్తోంది.
ఇందులో భాగంగానే జులై 2న తెలంగాణ జనగర్జన సభ నిర్వహిస్తోంది. ఈ సభకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ జన గర్జన సభ సన్నాహక సమావేశం ఇవాళ ఖమ్మంలో డీసీసీ కార్యాలయంలో జరగనుంది. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ సమావేశం నిర్వహించనున్నారు. ఈ సభకు భారీ జన సమీకరణ.. విజయంతంపై విస్తృతంగా చర్చించనున్నారు.
సీఎల్‌పీ నేత భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పేరిట సాగిన పాదయాత్ర అదే రోజు ఖమ్మం వేదికగా ముగియనుంది. ఈ సమావేశంలో డీసీసీ అధ్యక్షులు, సీనియర్ ఉపాధ్యక్షులు, ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, అధికార ప్రతినిధులు… అనుబంధ సంఘాల ఛైర్మన్లు పాల్గోననున్నారు. ఈ సన్నాహక సమావేశంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు, ప్రజాప్రతిధులు… పెద్ద ఎత్తున పాల్గొనున్నారని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మహేష్‌కుమార్ గౌడ్ వెల్లడించారు.