BREAKING : సివిల్ కానిస్టేబుల్ నియామకాలకు హైకోర్టు బ్రేక్

-

తెలంగాణలో కానిస్టేబుల్ అభ్యర్థులకు షాక్ తగిలింది. సివిల్ కానిస్టేబుల్ నియామకాలను తాజాగా అడ్డంకి ఏర్పడింది. కానిస్టేబుల్ నియామకాలకు హైకోర్టు తాత్కాలిక బ్రేక్ వేసింది. 4 ప్రశ్నలను తొలగించి మరోసారి మూల్యాంకనం చేయాలని… ఆ తర్వాత తాత్కాలిక ఎంపిక జాబితా ప్రకటించాలని హైకోర్టు పోలీస్ నియామక మండలిని ఆదేశించింది. ప్రశ్నలను తెలుగులో అనువాదం చేయకపోవడాన్ని హైకోర్టు తప్పుపట్టింది.

సివిల్ కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం నిర్వహించిన రాత పరీక్షల్లో ఇచ్చిన ప్రశ్నల్లో.. తెలుగులోకి అనువాదం చేయకపోవడం వల్ల నష్టపోయామని హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్లపై హైకోర్టు ధర్మాసనం సోమవారం రోజున విచారణ చేపట్టింది. ఈ నేపథ్యంలోనే ఆంగ్లంలో ఇచ్చిన ఐచ్చికాలు వాడుకలో ఉన్నవేనని పోలీస్ నియామక మండలి వాదించింది. ఆంగ్ల పదాలను తెలుగులో అనువాదం చేసే అవకాశం ఉన్నా పరిగణనలోకి తీసుకోకపోవడాన్ని ఉన్నత న్యాయస్థానం తప్పు పట్టింది.  4 ప్రశ్నలను తొలగించి.. ఆ తర్వాత మూల్యాంకనం చేయాలని పోలీస్ నియామక మండలిని ఆదేశించింది. హైకోర్టు తీర్పుతో నియామక ప్రక్రియ  ఆలస్యమయ్యే అవకాశం ఉంది

Read more RELATED
Recommended to you

Latest news