తెలంగాణ కానిస్టేబుల్ ఫలితాల విడుదల తేదీ ఖరారు..!

-

తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్ నియామక మండలి (టీఎస్ఎల్పీఆర్బీ) అధికారులు కానిస్టేబుల్ పోస్టుల తుది ఫలితాల విడుదలపై కసరత్తు ముమ్మరం చేశారు. వచ్చే వారంలో ఈ ఫలితాలను విడుదల చేయనున్నారు. సివిల్, ఏఆర్, ఏపీఎస్పీసహా ఇతర విభాగాల్లో కలిపి మొత్తం 16,925 మంది కానిస్టేబుళ్లు భర్తీ కానున్నారు. తొలుత నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం.. ఎస్సై పోస్టులకు టీఎస్ఎల్ఫీఆర్బీ ఇటీవల తుది ఫలితాలు వెల్లడించిన సంగతి తెలిసిందే. 

వీరందరికీ మెడికల్ టెస్టులు కూడా పూర్తికాగా.. ట్రైనింగ్ సెంటర్లో కూడా  జాయిన్ అయ్యారు. గతంలో తొలుత కానిస్టేబుల్ ఫలితాల తర్వాత ఎస్సై పోస్టులకు తుది ఫలితాలు వెలువడేవి. దీంతో తొలుత కానిస్టేబుళ్లుగా సెలక్టయిన అభ్యర్థులు ఎక్కడ ప్రభుత్వ ఉద్యోగాన్ని కోల్పోతామోనన్న భయంతో ఆ ఉద్యోగంలో చేరేవారు.  తర్వాత వీరిలో 10 నుంచి 15 శాతం వరకు అభ్యర్థులు ఎస్సైకి ఎంపికయ్యేవారు. దీంతో పోస్టులు బ్యాక్ లాగ్ పడేవి. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని ఈసారి రిక్రూట్మెంట్ లో తొలుత ఎస్సై, తర్వాత కానిస్టేబుల్ పోస్టులకు భర్తీ ప్రక్రియ కొనసాగిస్తూ వచ్చారు.

 

తుది ఫలితాల్లోనూ ఇదే పద్ధతి పాటిస్తున్నారు. దీంతో పోస్టులు మిగలకుండా.. మెరిట్ ప్రకారం.. పోస్టులను భర్తీ చేసే అవకాశం ఉంటుంది .  జూన్ 11 నుంచి జూన్ 26వ తేదీ వరకు నిర్వహించిన సర్టిఫికేట్ల వెరిఫికేషన్ కు మొత్తం 1,08,940 మంది హాజరయ్యారు. వెరిఫికేషన్ అనంతరం 97,175 మందిని ప్రొవిజినల్ సెలక్షన్ కు ఎంపిక చేశారు.   మరో వారంలో రోజుల్లో అంటే.. ఈ నెలాఖరులోగా తుది ఫలితాలు వెల్లడికానున్నాయి. 

 

Read more RELATED
Recommended to you

Latest news