హైదరాబాద్ లో మురికివాడలు పెరిగిపోతున్నాయి : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

-

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాల అమలు కోసం అధికారులు కృషి చేయాలి. మైనారిటీలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం రెసిడెన్షియల్ స్కూల్స్, హాస్టళ్లు మంజూరు చేస్తే అనేక రాష్ట్రాల్లో సరైన రీతిలో అమలు కావడం లేదు అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. అంగన్ వాడీ స్కూళ్లు, బీసీ, ఎస్సీ, ఎస్టీ హాస్టళ్ల నిర్మాణానికి భూమి కొరత నెలకొంది. రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ పథకాలను పారదర్శకంగా అమలు చేయాలి. దిశా కమిటీ మీటింగులో అనేక విషయాలపై చర్చించడం జరిగింది. ప్రతి మూడు నెలలకోసారి పథకాల అమలు, కార్యక్రమాలపై అధికారులంతా రివ్యూ చేసుకోవాలి.

ఇక నగరంలో మురికివాడలు పెరిగిపోతున్నాయి. తెలంగాణలో 70-80 శాతం రెవెన్యూ హైదరాబాద్ నుంచే వస్తున్నది. అయినా, జీహెచ్ఎంసీ, మెట్రో వాటర్ వర్క్స్ డిపార్ట్ మెంట్లకు నిధుల కొరత వేధిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ తో పాటు నగర పరిసర ప్రాంతాల ప్రజలకు కనీస మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత తీసుకోవాలి. రాష్ట్రంలో స్పోర్ట్స్ డిపార్ట్ మెంట్ మూతబడే పరిస్థితి ఎదురైంది. ప్రభుత్వ అధికారులంతా ప్రజలకు అందుబాటులో ఉండేలా ప్రజాక్షేత్రంలోకి వెళ్లాలి అని కేంద్ర మంత్రి సూచించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version