Telangana Deputy Chief Minister Bhatti Vikramarka Mallu: తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు ఒరిస్సా పర్యటన ఖరారు అయింది. నేడు తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు ఒరిస్సా పర్యటనకు వెళతారు. ఈ సందర్భంగా ఒరిస్సా ముఖ్యమంత్రితో నేడు భేటీ కానున్నారు తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు.

ఒరిస్సాలో సింగరేణి ఆధ్వర్యంలో చేపట్టనున్న నైని బొగ్గు బ్లాక్ తవ్వకాలకు కావలసిన అనుమతుల గురించి ఒరిస్సా సీఎంతో చర్చించనున్నారు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు. హైదరాబాద్ విమానాశ్రయం నుంచి ఈ రోజు ఉదయం ఒరిస్సా కు బయలుదేరి వెళ్లారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు. ఒరిస్సా నైని బొగ్గు బ్లాక్ అనుమతులు సాధిస్తే సింగరేణికి మరింత ఆర్థిక ప్రయోజనం చేకూరనుంది.