Hyderabad: స్విమ్మింగ్ పూల్‌లో కరెంటు షాక్…ఏకంగా 16 మంది

-

హైదరాబాద్ శివారులో విషాదం చోటు చేసుకుంది. స్విమ్మింగ్ పూల్‌లో కరెంటు తీగ పడటంతో.. కరెంటు షాక్ కొట్టి 16 మందికి గాయాలు అయ్యాయి. ఈ సంఘటన గురువారం చోటు చేసుకుంది. అయితే.. ఈ సంఘటన చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.

16 people injured due to electric shock in swimming pool

హైదరాబాద్ శివారు జల్‌ పల్లి లో, నాంపల్లి ఆగాపురా ప్రాంతం లో నివాసముండే మూడు కుటుంబాలకు చెందిన 56 మంది జల్‌పల్లిలోని ఓ ఫాంహౌస్‌కు వెళ్లారు. సాయంత్రం సమయం లో ఫాంహౌస్‌లోని స్విమ్మింగ్ పూల్ లోకి 16 మంది దిగారు. ఈత కొడుతుండగా ఆ నీటిలోకి ఒక్కసారిగా విద్యుత్ సరఫరా అవడం తో వీరంతా గాయ పడ్డారు. అందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఇక ఈ సంఘటన పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు… దర్యాప్తు చేస్తున్నారు. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news