తెలంగాణ నిరుద్యోగులకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త చెప్పింది. ఇటీవల నిర్వహించిన డీఎస్సీ ఫలితాలను మరో వారం రోజుల్లోనే విడుదల చేస్తామని… తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించడం జరిగింది. అదే సమయంలో కొత్త డీఎస్సీ ని కూడా ప్రకటించబోతున్నామని తెలిపారు. 6000 పోస్టులతో త్వరలోనే మరో మెగా డీఎస్సీ నిర్వహించనున్నట్లు వివరించారు డిప్యూటీ ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క.
రాష్ట్రంలోని మొత్తం 27,862 ప్రభుత్వ విద్యా సంస్థలకు ఉచితంగా విద్యుత్ సరఫరా చేస్తామని ప్రకటించారు. తమ ప్రభుత్వం గురువులకు ఎంతో ప్రాధాన్యత ఇస్తుందన్నారు భట్టి విక్రమార్క. మన రాష్ట్ర విద్యా వ్యవస్థ ఇంకా మారాల్సి ఉందని.. విద్యార్థుల్లో నైపుణ్యాలు పెంచేందుకు నైపుణ్య యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ విద్యాసంస్థలకు ఉచిత విద్యుత్ ని అందించే జీవోని కూడా విడుదల చేశామన్నారు.